ముహమ్మద్ చివరి సందేశహరుడా?

శాం షమూన్

ముహమ్మద్ ప్రవక్తలందరికి చివరిగా వచ్చి, ప్రవక్తలందరికి ముద్రగా ఉన్నట్లు ఖురాన్ చెబుతుంది. అంటే అతనే చివరి ప్రవక్త అని ఖుర్‍ఆన్ అర్థము చెబుతోంది.

(మానవులారా) ముహమ్మద్ మీలోని ఏ పురుషునికీ తండ్రి కారు. కాని ఆయన అల్లాహ్ యొక్క ప్రవక్త, దైవప్రవక్తల పరంపరను సమాప్తం చేసే చివరివారు. అల్లాహ్ సకల విషయాల జ్ఞానం కలవాడు.” (సూరా33:40)

గమనించండి, ఈ వచనాలలో ముహమ్మద్ చివరి ప్రవక్త అని ఉందికాని చివరి సందేశహరుడు అనే భావం లేదు. అపొస్తలులకు లేదా రసూల్‍లకు ఆయనే ముద్రలాంటి వాడనే భావం కూడ లేదు. రసూల్ లేక అపొస్తలుడు అన్ననూ ఖుర్‍ఆన్‍ ప్రకారం ''సందేశహరుడు'' అని అర్థము. క్రిందికి చదువుతుండగా ఈ విషయాలన్నీ మీకు అర్థమవుతాయి.            

ఒక సందేశహరునికి మరియు ఒక ప్రవక్తకు మధ్య తేడా ఉందని ఖురాన్ చెబుతుంది.

ఓ ప్రవక్తా, నీకు పూర్వం, అతను కోరుకున్నప్పుడు, అతని ఆ కోరికలో షైతాన్ జోక్యం చేసుకోని ఏ సందేశహరుణ్ణీ, ఏ ప్రవక్తనూ మేము పంపి ఉండలేదు. ఇటువంటి షైతాన్ జోక్యాలను అల్లాహ్ నిర్మూలిస్తాడు మరియు తన ఆయతులను (వచనాలను) పటిష్ఠ పరుస్తాడు. అల్లాహ్ సర్వజ్ఞాని, మహా వివేకి.” (సూరా 22:52)

ఖురాన్ వ్యాఖ్యానకర్త అయిన అల్-జమక్షరీ, మనము పైన చూసిన వాక్యం గూర్చి ఈ విధంగా వ్యాఖ్యానం వ్రాశాడు.

సందేశహరుణ్ణీ, ఏ ప్రవక్తనూ మేము పంపి ఉండలేదు” - ఈ వచనమునుబట్టి అర్థమైంది ఏమంటే ఒక సందేశహరునికి (రసూల్కి) మరియు ఒక ప్రవక్తకి (నబీకి) మధ్య తేడా ఉందని ఈ వచనమే చెబుతోంది. “ప్రవక్తల (నబీల) గురించి మాకు తెలపండి” అని ముహమ్మద్‍ని ఒకసారి ఒకరు ప్రశ్న వేశారు. అతడు ఇలా అన్నాడు - నూట ఇరువైనాలుగు వేలమంది (1,24,000) ప్రవక్తలు ఉన్నారని బదులిచ్చాడు. ఆ తరువాత వారిలో ఎంతమంది సందేశహరులు (రసూల్‍లు) అని అడిగినప్పుడు అతను - మూడువందల పదమూడుమంది (313) అని జవాబిచ్చాడు. సందేశహరుడు (రసూల్) అంటే ప్రవక్తలలో (నబీలలో) ఒకరు, కాని అద్భుతాలు చేసే శక్తి అతనికి ఉంటుంది, అతనితో పాటుగా ఒక పుస్తకం క్రిందకు పంపబడుతుంది అని అన్నాడు. ఒక ప్రవక్త (నబీ) అనగా అర్థమేమంటే అతను సందేశహరుడు కాడు, అతని మీదకు ఏ పుస్తకము అవతరించబడదు. అంటే అంతకుముందే బయలుపరచబడిన ధర్మశాస్త్రము (షరీయహ్) విషయంలో ప్రజలను కొన్ని హద్దులకు లోపరచాలని మాత్రమే వారికి ఆదేశం ఇవ్వబడుతుంది అన్నాడు. (Helmut Gätje, The Qur'an and its Exegesis [Oneworld Publications, Oxford 1996], p. 54)

ఒక సందేశహరునికి మరియు ప్రవక్తకు మధ్య అల్-జమక్షరీ తెల్పుతున్న ఈ వ్యత్యాసాన్ని ఖురాన్ ధృవీకరించదు. నిజానికి సందేశహరులు పుస్తకముతో పంపబడ్డారని ఖురాన్ చెబుతున్నప్పటికి (40:70; 57:25) ప్రవక్తలకు కూడా లేఖనాలు ఇవ్వబడ్డాయి అని ఖురాన్ తెలియచేస్తుంది.  

ప్రారంభంలో మానవులంతా ఒకే మార్గం అనుసరించారు.(కాని తరువాత పరిస్థితులు మారాయి. అభిప్రాయ భేదాలు ఉత్పన్నమయ్యాయి). అప్పుడు అల్లాహ్ ప్రవక్తలను పంపాడు. వారు సత్యమార్గంలో నడిచేవారికి శుభవార్తలు తెలిపేవారు. వక్రమార్గం అనుసరిస్తే దుష్పలితాలు కలుగుతాయని హెచ్చరిక చేసేవారు. సత్యం గురించి ప్రజలలో పొడచూపిన విభేదాలు పరిష్కరించటానికి వారితోపాటు పరమ సత్యంవున్న గ్రంథాన్ని కూడ పంపాడు - (ఈ అభిప్రాయభేదాలు తలెత్తటానికి కారణం ప్రారంభంలో ప్రజలకు సత్యం తెలుపబడకపోవటం ఎంతమాత్రం కాదు), ఈ విభేదాలను సృష్టించినవారు సత్యజ్ఞానం ప్రసాదింపబడ్డవారే. స్పష్టమైన హితోపదేశాలు పొందిన తరువాత కూడ వారు కేవలం ఒకరి కొరకు అన్యాయం చేసుకునే ఉద్దేశ్యంతో అసలు సత్యాన్ని వదలి విభిన్న పధ్ధతులను సృష్టించుకున్నారు - అయితే ప్రవక్తలను విశ్వసించిన వారికి అల్లాహ్ తన అనుమతితో ప్రజలు వివాదపడిన సత్యాన్ని పొందేమార్గం చూపాడు. అల్లాహ్ తాను కోరిన వారికి ఋజుమార్గం చూపుతాడు.” (సూరా 2:213)

ఇదీ మా తర్కము. దానినే మేము ఇబ్రాహీముకు, తన జాతికి వ్యతిరేకంగా ప్రసాదించాము. మేము కోరినవారికి ఉన్నత స్థానాలను ప్రసాదిస్తాము. సత్యం ఏమిటంటే నీ ప్రభువు వివేకవంతుడు, అన్నీ తెలిసినవాడు. మేము తరువాత ఇబ్రాహీముకు, ఇస్హాఖ్, యాఖూబ్ వంటి సంతానాన్ని ప్రసాదించాము. ప్రతి ఒక్కరికి మేము ఋజుమార్గం చూపించాము. (ఈ ఋజు మార్గాన్నే) వారికి పూర్వం నూహ్కు చూపాము. ఇంకా అతని సంతతిలోని వారైన దావూదు, సులైమాన్, అయ్యూబ్ , యూసుఫ్, మూసా, హారూన్లకు మేము(సన్మార్గం చూపించాము). ఈ విధంగా మేము సజ్జనులకు వారు చేసిన సత్కార్యానికి ప్రతిఫలం ఇస్తాము. (అతని సంతతికి చెందిన) జకరియ్యా, యహ్యా, ఈసా, ఇల్యాస్లకు (మార్గం చూపాము). వారిలో ప్రతి ఒక్కడూ సజ్జనుడే. (ఇంకా ఆయన కుటుంబానికే చెందిన) ఇస్మాయీలు, అల్యస్అ, యూనుస్, లూత్లకు (సన్మార్గం చూపాము). వారిలో ప్రతి ఒక్కరికీ మేము భూలోక వాసులందరిపై ఘనతను ప్రసాదించాము. ఇంకా వారి తాత ముత్తాతలనూ వారి సంతానాన్నీ వారి తోబుట్టువులలో చాలా మందినీ మేము అనుగ్రహించాము. వారిని మా సేవకొరకు ఎన్నుకున్నాము. వారికి ఋజుమార్గం వైపునకు దారి చూపాము. ఇది అల్లాహ్ మార్గదర్శకత్వం. దాని ద్వారా ఆయన తన దాసులలో తాను కోరిన వారికి మార్గం చూపుతాడు. కాని వారు ఒకవేళ షిర్కు చేసి ఉండినట్లయితే, వారు చేసిన సమస్తం నాశనం అయివుండేదే. మేము గ్రంథాన్నీ, ఆజ్ఞనూ, ప్రవక్త పదవినీ ప్రసాదించిన వారు వీరే. ఒకవేళ వారు దానిని విశ్వసించటానికి తిరస్కరిస్తే (ఫర్వాలేదు) మేము ఈ అనుగ్రహాన్ని వేరే ప్రజలకు అప్పగించాము. వారు దానిని తిరస్కరించేవారు కారు.” (సూరా 6:83-89)

మేము అతనికి ఇస్హాఖ్, యాఖూబ్ (వంటి సంతానం) లను ప్రసాదించాము; అతని వంశంలో ప్రవక్త పదవినీ, గ్రంథాన్నీ ఉంచాము. ప్రవంచంలో అతనికి అతని ప్రతిఫలం ఇచ్చాము. పరలోకంలో అతను నిశ్చయంగా సజ్జనులలో చేర్చుకోబడతాడు.” (సూరా 29:27)

పూర్వం మేము ఇస్రాయీల్ సంతతి వారికి గ్రంథాన్నీ, ఆజ్ఞనూ, ప్రవక్త పదవిని ప్రసాదించాము. వారికి మేము మంచి జీవన సామగ్రిని అనుగ్రహించాము. ప్రపంచంలోని ప్రజలందరిపై వారికి ఘనతను దయచేశాము.” (సూరా 45:16)

మేము నూహ్ను, ఇబ్రాహీమ్ను పంపాము. ఆ ఉభయుల సంతతిలో ప్రవక్త పదవినీ, గ్రంథాన్నీ పెట్టాము. తరువాత వారి సంతానంలో కొందరు సన్మార్గాన్ని అవలంబించారు; కాని చాలా మంది అవిధేయులైపోయారు.” (సూరా 57:26)

పై వచనాలన్నీ తెలియచేసేదేమనగా ప్రవక్తలందరికి కూడ లేఖనాలు ఇవ్వబడ్డాయి. అహరోను ఒక ప్రవక్తయినాగాని అతనికి పుస్తకము ఇవ్వబడలేదు కదా! అని కొంతమంది వాదించవచ్చు; దానిని ఆధారం చేసికొని ప్రతి ప్రవక్తకు కూడ ఇతరులకు అందచేయడం కోసమై ఒక పుస్తకం ఇవ్వబడలేదు అని ఋజువుచేయడానికి ప్రయత్నించవచ్చు.

దయతో మేము అతని సోదరుడు హారూన్ను ప్రవక్తగా నియమించి అతనికి (సహాయకునిగా) ఇచ్చాము.” (సూరా 19:53)

అలాంటి వాదన చేసేవారు ఖురాన్ని సరిగ చదువలేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మోషేతో పాటుగా అతనికి కూడ ఒక లేఖనాన్ని పంపానని ఖురానే చెబుతుంది.

పూర్వం మేము మూసా, హారూన్లకు గీటురాయినీ, జ్యోతిని, జ్ఞాపికనూ ప్రసాదించి ఉన్నాము; దైవభీతి కలవారి మేలు కొరకు.” (సూరా 21:48)  

మేము మూసాకు, హారూన్కు మేలు చేశాము … మేము వారికి స్పష్టమైన గ్రంథాన్ని ప్రసాదించాము.” (సూరా  37:114,117)

అంతేకాకుండ ఖురాన్లో "ప్రవక్త మరియు సందేశహరుడు" అనే పదాలు మహమ్మద్‍కు ఎప్పుడెప్పుడు వాడబడ్డాయి అని జేమ్స్ ఆర్లన్డ్సన్ (James Arlandson) అనునతడు చేసిన పరిశోధనల ప్రకారం, “ప్రవక్త” మరియు “సందేశహరుడు” అనే ఈ రెండు బిరుదుల్లోకెల్ల “ప్రవక్త” అనేది చాలా గొప్పదిగాను, అంతేకాకుండ మహమ్మద్‍కు కేవలం రెండు సార్లు మాత్రమే సురా 7లో వాడబడినది అని గమనించవచ్చు.

ఇప్పటివరకు మనం చూసిందేమనగా - ముహమ్మద్ చివరి ప్రవక్త అని ఖురాన్ తెలియచేసినది కాని అతడే చివరి సందేశహరుడు అని తెలియచేయలేదు. అంతేకాకుండ ఒక ప్రవక్తకు, ఒక సందేశహరునికి మధ్య తేడా ఉందని, వారు వాటిని ఇతరులకు అందచేసేలాగున ప్రవక్తలకు కూడ అల్లాహ్ లేఖనాలను అందచేస్తాడని ఖురాన్ తెలియచేసింది.

ముహమ్మద్ స్వయంగా చెప్పిన మాటల ప్రకారం నూట ఇరువై నాలుగువేల మంది (1,24,000) ప్రవక్తలు ఉన్నారని, వారిలో మూడు వందల పదమూడు మంది (313) మాత్రమే సందేశహరులని తెలుస్తున్నది. ఆయన చెప్పిన మాటల ప్రకారం, సాధారణంగా అందరు ఇప్పటివరకు - సందేశహరులనగా ప్రవక్తలలో ఒక చిన్న గుంపు అని భావిస్తున్నారు. మరియు వారు (సందేశహరులు) కొన్ని నూతనమైన ప్రత్యక్షతలతో వచ్చారని నమ్మబడుతుంది; అది ఒక పుస్తకం కావచ్చు, నూతనమైన ధర్మశాస్త్రం కావచ్చు. కాని ప్రవక్తలు ప్రజలకు హెచ్చరికలు చేసి, అంతకుముందే దేవుడు బయలుపరచిన ధర్మశాస్త్రం వైపు ప్రజలను మళ్ళించేవారు. ఐతే ఈ ఆలోచన కూడ ఖురాన్ చెప్తున్న ఆలోచనకి విరుధ్ధంగా ఉంది. ఎందుకంటే ప్రవక్తలు కూడా లేఖనాలు పొందినవారే అని ఖురాన్ మాటిమాటికి చెప్పుచున్నది.

అయితే ఇక్కడ మిగిలిన ప్రశ్న ఏమంటే - ప్రవక్తల సమూహానికి, సందేశహరుల సమూహానికి మధ్యవున్న సంబంధం ఏమిటి? ఒకనిని  ప్రవక్త అని ఎలా చెప్పగలం? ఒకనిని సందేశహరుడుగా ఎలా చెప్పగలం? ఖురాన్ ప్రవక్తలకి, సందేశహరులకి తేడా ఉందని చెప్పుచున్నది కాని ఆ తేడా ఏమిటో తెలియచేయదు.

ఈ రెండు గుంపులు కూడ పూర్తిగా వ్యత్యాసమైనవా? లేదంటే ఎక్కడైనా వాటి గుణగణాలలో కలుస్తుంటాయా? వారిరువురుకి సరిపడే గుణగణాలు ఏవైనా ఉన్నాయా? లేదంటే ఈ రెండు గుంపులు ఒకటే కావచ్చా?

ఇప్పటివరకు మనం ఖుర్‍ఆన్ ప్రకారం ప్రవక్తలకు మాత్రమే లేఖనాలు ఇవ్వబడ్డాయి అనుకున్నాం కాబట్టి, ఇప్పుడు మనకు అర్థమవుతున్నది ఏమనగా - పాపంపర్యముగా ముస్లింలు ఆలోచిస్తున్న ఆలోచనా సరళి సరైందికాదు; అందరు ప్రవక్తలు కూడ సందేశహరులే; కాని అందరు సందేశహరులు ప్రవక్తలు కాదు. ఖురాన్ మనకు అందించిన వచనాలలో స్పష్టంగా తెలుస్తున్నది ఏమంటే, కొంతమంది ప్రవక్తలగాను కొంతమంది సందేశహరులుగాను ఉన్నారు, మరియు ఇంకొందరు ఆ రెండు గుంపులకు చెందినవారిగా కూడ ఉన్నారు. ఉదాహరణకు యేసు ప్రభువారికి ఖుర్ఆన్‍లో ఆ రెండు బిరుదులు కూడా ఇవ్వబడ్డాయి.

గ్రంథ ప్రజలారా! మీ ధర్మవిషయాలలో అతిగా ప్రవర్తించకండి. అల్లాహ్‍కు సత్యంతప్ప వేరే విషయాన్ని ఆపాదించకండి. మసీహ్, మర్యమ్ కుమారుడైన ఈసా, అల్లాహ్ పంపిన ఒక సందేశహరుడు (రసూల్), అల్లాహ్ మర్యమ్ వైపునకు పంపిన ఒక ఆజ్ఞ, అల్లాహ్ తరపునుండి వచ్చిన (మర్యమ్ గర్భంలో బిడ్డ రూపందాల్చిన) ఒక ఆత్మ తప్ప మరేమీకాదు. కనుక అల్లాహ్‍ను, ఆయన ప్రవక్తలను విశ్వసించండి. “ముగ్గురు” అని అనకండి. ఇలా అనటం మానివెయ్యండి. ఇది మీకే శ్రేయస్కరం. అల్లాహ్ ఒక్కడే దేవుడు. ఆయన పరిశుధ్ధుడు. ఆయనకు ఒక కొడుకు ఉన్నాడనే విషయానికి ఆయన అతీతుడు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయన ఆస్తియే. దాని పోషణకు, దాని రక్షణకు ఆయనే చాలు”. (సూరా 4:171)

పిల్లవాడు ఇలా పలికాడు ‘నేను అల్లాహ్ దాసుణ్ణి. ఆయన నాకు గ్రంథాన్ని ఇచ్చాడు, నన్ను ప్రవక్తగా (నబీ) నియమించాడు. నేను ఎక్కడున్నా సరే, ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు. నేను జీవించి ఉన్నంత కాలం నమాజును, జకాతును పాటించు అని ఆజ్ఞాపించాడు. నా తల్లి హక్కును నెరవేర్చేవానిగా నన్ను చేశాడు. నన్ను దౌర్జన్యపరునిగాను, పాషాణ హృదయునిగాను చేయలేదు. నేను పుట్టిన రోజునా, నేను మరణించేరోజునా, బ్రతికింపబడి లేపబడేరోజునా నాకు శాంతి కలుగుతుంది’. ఇతనే మర్యమ్ కుమారుడు ఈసా; ఇదే అతనికి సంబంధించిన అసలు నిజం. దానిని గురించి ప్రజలు సందేహిస్తున్నారు”. (సూరా 19:33,34)

మరొక ఆసక్తికరమైన విషయం ఏమంటే, ప్రవక్తల అందరి గురించి అల్లాహ్ ఒక నిబంధన చేయించాడు. అదేమంటే, పేరుచెప్పబడని ఒక సందేశహరుడు రాబోవుచున్నాడు అతనికి సహాయం చేయాలని ప్రవక్తలందరితో ఒక నిబంధన చేయించాడు.

ఏ వ్యక్తికైనా అల్లాహ్ గ్రంథాన్ని, వివేకాన్ని, ప్రవక్తపదవిని ప్రసాదిస్తే, అతడు ప్రజలతో, "మీరు అల్లాహ్‍కు బదులుగా నాకు దాసులు కండి" అని అనటం తగదు. అతడు ఇదే అంటాడు, "మీరు ఇతరులకు బోధించేటటువంటి, స్వయంగా చదివేటటువంటి గ్రంథంలోని ఉపదేశాలు కోరే విధంగా నిజమైన ‘రబ్బానీలు’ అవండి." దైవదూతలనో లేక ప్రవక్తలనో ప్రభువులుగా చేసుకోండి అని అతను మీతో ఎన్నటికీ అనడు. ముస్లిములయిన మీకు ఒక ప్రవక్త అవిశ్వాసాన్ని అవలంబించండి అని ఆదేశించటం సాధ్యమా? జ్ఞాపకం తెచ్చుకోండి, ప్రవక్తలనుండి అల్లాహ్ ఈ వాగ్దానం తీసుకున్నాడు. "నేను ఈ రోజు మీకు గ్రంథాన్ని, వివేకాన్ని ప్రసాదించాను. పూర్వంనుండీ మీ వద్ద ఉన్న హితోపదేశాన్ని ధ్రువీకరిస్తూ రేపు సందేశహరుడు (రసూల్) ఎవరైనా మీ వద్దకు వస్తే ఆయనను మీరు విశ్వసించవలసి ఉంటుంది, ఆయనకు సహాయం చెయ్యవలసి ఉంటుంది. ఈ విధంగా ప్రవచించి అల్లాహ్ ఇలా అడిగాడు, "ఈ విషయాన్ని మీరు అంగీకరిస్తారా? నా తరపునుండి మీపై మోపబడిన ఈ ప్రమాణం బరువు బాధ్యతలను మీరు స్వీకరిస్తారా?" వారు ఇలా అన్నారు, "అవును మేము స్వీకరిస్తాము." అప్పుడు అల్లాహ్ ఇలా అన్నాడు, "అయితే దీనికి సాక్షులుగా ఉండండి. మీతోపాటు నేను కూడా సాక్షిగా ఉంటాను." (సూరా 3:79-81)

అసద్ చేసిన ఆంగ్ల అనువాదంలో దీని గురించి ఈ విధంగా వుంది -

అక్షరాలా దీనిని “ప్రవక్తల గంభీర ప్రమాణం” అని అనువదించవచ్చు. ఈ నిబంధన లేక ప్రమాణమును సమాజమంతంటి నుంచి అల్లాహ్ తీసుకున్నాడు అని అల్ జమక్షరీ అన్నాడు. ప్రవక్తలు వారికి అందచేసిన సందేశములకు తప్పకుండా లోబడుతామని సమాజములోని ప్రజలంతా శపథం చేశారు.

తనువు చాలించిన ముహమ్మద్ అలీ తన ఆంగ్ల ఖుర్‍ఆన్ అనువాదంలో పై వచనములో  “మితక్ అల్-నబియ్యిన్” అని వాడబడిన అరబీ మాటలకు ఈ విధంగా వివరణ వ్రాశాడు -

81a. “మితక్ అల్-నబియ్యిన్” యొక్క అక్షరార్థమైన అర్థం ఏమిటంటే “ప్రవక్తల యొక్క నిబంధన”. అంటే “ప్రజలందరు అల్లాహ్‍కు చేసిన నిబంధన” కావచ్చు లేదా “ప్రవక్తలందరు తమ ప్రజలతో చేసిన నిబంధన” కావచ్చు. ఆ వచనాలలో ఉన్న మాటలు కేవలం ప్రజలను ఉద్దేశించి చెప్పబడినవి కాబట్టి, మరిముఖ్యంగా ఆ చివరి రెండు వచనాలలో యూదులను, క్రైస్తవులను ఉద్దేశించి చెప్పబడినది కాబట్టి రెండో భావమును తీసుకుంటూ “ప్రవక్తలందరు తమ ప్రజలతో చేసిన నిబంధన” అనే అర్థాన్ని నేను వ్రాస్తున్నాను. మోషే మరియు యేసుక్రీస్తు కూడా తమ తమ ప్రజల నుంచి నిబంధన కోరుతూ, ఏ ప్రవక్త గురించైతే వారు ప్రవచించారో ఆ ప్రవక్తను వారు అంగీకరించాలని తమ ప్రజల వద్ద ఒడంబడికను కోరారు. ఈ విధంగా మోషే ద్వారా సర్వశక్తిమంతుడైన దేవుడు ఇశ్రాయేలీయులను హెచ్చరిస్తూ “నాతరువాత  నావంటి ప్రవక్త నీ సహోదరులలో నుండి వచ్చును. అతడు నా నామంలో పలుకు మాట వినని ప్రతివానిని విచారించుదును” అని అన్నాడు. (ద్వితీ. కాండం 18:19). అంతేకాకుండా రాబోవు ఆదరణకర్త గురించి యేసుక్రీస్తు ప్రవచించినప్పుడు, “ఆయన మిమ్ములను సర్వసత్యంలోనికి నడిపించును (యోహను 16:13)” అని ఎంతో నిర్దిష్ఠమైన మాటలను ఉపయోగించారు. కాబట్టి ముహమ్మద్ ప్రవక్త కూడా తన ఆగమనమును గురించి ప్రపంచంలోని ప్రవక్తలందరు తెలియచేశారు అని చెప్పాడు. దీనిని గూర్చిన సాక్ష్యం నూతన నిబంధనలో కనిపిస్తుంది (అపొ.కార్యములు 3:21,22). ఒక్కొక్క ప్రవక్త లోకములోనికి వస్తూండగా అల్లాహ్ వారి చేత ఆ నిబంధనను విడివిడిగా చేయించాడు. అంతేకాకుండ, ప్రవక్తలందరు కూడ ముహమ్మద్ ప్రవక్త యొక్క ఆగమనమును గూర్చి ముందుగానే తెలియచేస్తూ, ఆయన వచ్చినపుడు ఆయనకు విధేయులు అవ్వాలని వారివారి ప్రజలను హెచ్చరిస్తూ వారి యొద్ద ఒక ఒడంబడిక తీసుకున్నారు. అదేవిధంగా నానా కాలములలో నానా ప్రజల మధ్య పరిచర్య చేసిన ప్రవక్తలందరు చెప్పిన మాటలను కూడా వారు వినాలని, నమ్మాలని ముహమ్మద్ ప్రవక్త కూడ తెలియచేశాడు. లోకంలోని ప్రవక్తలందరూ చెప్పిన సాక్ష్యం నమ్మదగినదని ముహమ్మద్ సాక్ష్యమిచ్చుట ద్వారా, తన ఆగమనమును గూర్చి ప్రపంచంలోని ప్రవక్తలందరు చెప్పిన సాక్ష్యం కూడా నమ్మదగినదని ఋజువు చేశాడు.

పైన అలీ చేసిన ఈ వాఖ్యానము చాలా ఆశ్చర్యపరిచే విధంగా వుంది. ఇతను ముస్లిములలోని అహ్మదీయ తెగకు చెందినవాడు. అతడు చెందిన అహ్మదీయ గుంపును స్థాపించిన మీర్జా గులామ్ అహ్మద్ తాను ముహమ్మద్ తర్వాత ఒక ప్రవక్తనని, వాగ్దానం చేయబడిన మెస్సీయ తానేనని చెప్పుకున్నాడు. ఐతే మిగితా వారందరూ నిర్ధారించినట్టుగా పై వచనములోని ఆ సందేశహరుడు ఎవరో కాదు కేవలం ‘ముహమ్మద్’ అని అలీ కూడా మిగితా ముస్లింలు కోరుచున్న విధంగానే వాఖ్యానించుట ఎంతో ఆశ్చర్యకరము.

కాని ఈ ముస్లింలు ఒక విషయంలో తప్పిపోతున్నారు. అదేమనగా, అల్లాహ్ ఏ ప్రవక్తలతో నిబంధన చేశాడో ఆ ప్రవక్తలలో ముహమ్మద్ కూడా ఒకడని ఖురాన్ చెబుతున్న విషయాన్ని ముస్లింలు గుర్తించడం లేదు.

''నిస్సందేహంగా విశ్వాసులకు దైవప్రవక్త స్వయంగా తమకంటే కూడా ముఖ్యుడు. దైవప్రవక్త భార్యలు వారికి తల్లులు. కాని అల్లాహ్ గ్రంథం ప్రకారం సాధారణ విశ్వాసులు మరియు వలస వచ్చిన వారికంటే రక్తసంబంధీకులు ఒక్కరిపై ఒకరు ఎక్కువ హక్కులు కలిగి ఉంటారు. అయితే, మీ సహచరులకు మీరు ఏదైనా మేలు(చేయదలిస్తే) చేయవచ్చు. ఈ ఆజ్ఞ దైవగ్రంథంలో వ్రాయబడి ఉంది. (ఓ ప్రవక్తా) మేము దైవప్రవక్తలందరి చేత చేయించిన వాగ్దానాన్ని జ్ఞపకముంచుకో. నీతో కూడ (చేయించాము) మరియు నూహ్, ఇబ్రాహీమ్, మూసా, మర్యమ్ కుమారుడు ఈసాలతో కూడా (చేయించాము), అందరితో మేము గట్టివాగ్దానం చేయించాము; నిజాయితీపరులను(వారి ప్రభువు) వారి నిజాయితీని గురించి ప్రశ్నించేందుకు. అవిశ్వాసులకు ఆయన అత్యంత బాధాకరమైన శిక్షను సిధ్ధంచేసే ఉంచాడు.'' (సూరా 33:6-8)

అల్లాహ్ తన ప్రవక్తలతో మరియు ప్రవక్తల ద్వారా ఒక నిబంధన చేయించాడన్న విషయం కేవలం మరొక్క చోట మాత్రమే అనగా మనం పైన చదివిన సూరా 3:81లో కనబడుతుంది. సూరా 3:81లో చెప్పబడిన విషయం ప్రకారం మనము ఈ లేఖనాన్ని విశ్లేషిస్తే అల్లాహ్ ముహమ్మద్ నుంచి కూడా ఒక నిబంధనను లేక ఒడంబడికను కోరాడు అని స్పష్టముగా అర్థమవుతుంది. అంటే ముహమ్మద్ మరియు అతని యొక్క ప్రజలు కూడా ప్రవక్తలందరికి ఇవ్వబడిన లేఖనాల ప్రకారంగా రాబోవుచున్న మరో సందేశహరుడి కోసం ఎదురుచూడాలని వారందరికి చెప్పబడింది. ఖురాన్లో ఉన్న ఈ అసందర్భము లేక తప్పువల్ల ముహమ్మద్ తర్వాత కూడ కనీసం ఇంకొక్క సందేశహరుడినైనా అల్లాహ్ పంపనుద్దేశిస్తున్నాడు అని అర్థము కలుగుచున్నది. అలాంటి వారిలో రషద్ ఖలీఫా ఒకరు. అతడిని రక్తపిపాసులైన కొందరు ముస్లింలు అతి దారుణంగా చంపారు. అతను, అతని అనుచరులు ఏవిధంగా సూరా 3:81,33:7, మరియు 40లను తమకోసం అన్వయించుకుంటూ వాడుకున్నారో ఈ వెబ్సైట్లో చదువగలరు.

ఖురాన్ రచయిత ఈ గందరగోళాన్నంతటిని ఖుర్‍ఆన్‍లోంచి తప్పించి ఉండవచ్చు. ప్రతివారు తమకిష్టమొచ్చిన రీతిలో ఈ రెఫరెన్సులను వాడుకొనకుండా వారిని నిరోధించి ఉండవచ్చు. అదేలాగంటే, ముహమ్మద్ పేరుని అక్కడ ప్రస్తావిస్తూ ముహమ్మదే చివరి ప్రవక్త, మరియు చివరి సందేశహరుడు కూడా అని తెలియచేస్తే చాలు. ఇంకొకమాటలో చెప్పాలంటే, సూరా 3:81లో ఆ రచయత ఒక సందేశహరుడు రాబోవుచున్నాడు, అతని పేరు ఫలానిదని ఆ సందేశహరుని పేరు స్పష్టంగా చెప్పుట ద్వారా, యేసుప్రభుని నోటి ద్వారా ఈ క్రింది విధంగా ఖురాన్లో అల్లాహ్ పలికించినట్టుగా ఇక్కడ కూడ ముహమ్మద్ పేరును ప్రస్తావించి ఉంటే ఈ తంటాలేవీ లేకుండా బాగుండేది.

''మర్యమ్ కుమారుడు ఈసా అనిన మాటలను జ్ఞాపకం తెచ్చుకో, "ఓ ఇస్రాయీల్ సంతతి వారలారా! నేను మీ వద్దకు అల్లాహ్‍చే పంపబడిన సందేశహరుణ్ణి; నాకు పూర్వం వచ్చిన తౌరాత్ గ్రంథాన్ని ధృవపరుస్తున్నాను; నా తరువాత ‘అహ్మద్’ అనే ప్రవక్త రాబోతున్నాడు అనే శుభవార్తను అందజేస్తున్నాను. అయితే ఆయన (ముహమ్మద్ సఅసమ్) వారి వద్దకు స్పష్టమైన సూచనలను తెచ్చినప్పుడు, వారు ఇది పూర్తిగా మోసమే అని అన్నారు.'' (సూరా 61:6)

(గమనిక : నిజానికి ఈ వచనము యొక్క అర్థం కూడా ప్రశ్నార్థకమే ఎందుకనగా - ‘అహ్మద్’ అనే పదము ఒక వ్యక్తి యొక్క పేరేనా లేక ఆ వ్యక్తి యొక్క గుణగణాలను వివరించే పదమా అని ఎవరూ ఇప్పటివరకూ ఖచ్చితముగా తేల్చి చెప్పలేకపోతున్నారు)

లేదంటే సూరా 33:40 వచనంలోనే ముహమ్మద్ చివరి ప్రవక్త లేక చివరి సందేశహరుడని ఖురాన్ తెలిపి ఉండవచ్చు. కాని విచారకరంగా అతి భక్తిగల ముస్లిములకు ఖురాన్లో అలాంటి ఆధారాలు లేక ఋజువులు మచ్చుకైనా కనిపించవు.

ముహమ్మదే చివరి సందేశహరుడు అని ఖురాన్లో స్పష్టంగా లేదు కాబట్టి కొన్ని ముస్లిం మతశాఖలు, మత వర్గాలు ఖురాన్లో వున్న ఈ అస్తవ్యస్త మాటలను, దాని అసంపూర్ణతను సొమ్ము చేసుకున్నాయని మనం గమనించగలము.

పైన తెలిపిన విషయముల నుండి మరొక సమస్య ఉత్పన్నం అవుతుంది. అదేమిటో ఈ క్రింద చూద్దాం -

ఇదీ మా తర్కము. దానినే మేము ఇబ్రాహీముకు, తన జాతికి వ్యతిరేకంగా ప్రసాదించాము. మేము కోరినవారికి ఉన్నత స్థానాలను ప్రసాదిస్తాము. సత్యం ఏమిటంటే నీ ప్రభువు వివేకవంతుడు, అన్నీ తెలిసినవాడు. మేము తరువాత ఇబ్రాహీముకు, ఇస్హాఖ్, యాఖూబ్ వంటి సంతానాన్ని ప్రసాదించాము. ప్రతి ఒక్కరికి మేము ఋజుమార్గం చూపించాము. (ఈ ఋజు మార్గాన్నే) వారికి పూర్వం నూహ్‍కు చూపాము. ఇంకా అతని సంతతిలోని వారైన దావూదు, సులైమాన్, అయ్యూబ్, యూసుఫ్, మూసా, హారూన్లకు మేము (సన్మార్గం చూపించాము). ఈ విధంగా మేము సజ్జనులకు వారు చేసిన సత్కార్యానికి ప్రతిఫలం ఇస్తాము. (అతని సంతతికి చెందిన) జకరియ్యా, యహ్యా, ఈసా, ఇల్యాస్లకు (మార్గం చూపాము). వారిలో ప్రతి ఒక్కడూ సజ్జనుడే. (ఇంకా ఆయన కుటుంబానికే చెందిన) ఇస్మాయీలు, అల్యస్అ, యూనుస్, లూత్లకు (సన్మార్గం చూపాము). వారిలో ప్రతి ఒక్కరికీ మేము భూలోక వాసులందరిపై ఘనతను ప్రసాదించాము. ఇంకా వారి తాత ముత్తాతలనూ వారి సంతానాన్నీ వారి తోబుట్టువులలో చాలా మందినీ మేము అనుగ్రహించాము. వారిని మా సేవకొరకు ఎన్నుకున్నాము. వారికి ఋజుమార్గం వైపునకు దారి చూపాము. ఇది అల్లాహ్ మార్గదర్శకత్వం. దాని ద్వారా ఆయన తన దాసులలో తాను కోరిన వారికి మార్గం చూపుతాడు. కాని వారు ఒకవేళ షిర్కు చేసి ఉండినట్లయితే, వారు చేసిన సమస్తం నాశనం అయివుండేదే. మేము గ్రంథాన్నీ, ఆజ్ఞనూ, ప్రవక్త పదవినీ ప్రసాదించిన వారు వీరే. ఒకవేళ వారు దానిని విశ్వసించటానికి తిరస్కరిస్తే (ఫర్వాలేదు) మేము ఈ అనుగ్రహాన్ని వేరే ప్రజలకు అప్పగించాము. వారు దానిని తిరస్కరించేవారు కారు.” (సూరా 6:83-89) 

పై వచనంలోని ప్రవక్తలందరికీ లేఖనాలు ఇవ్వబడ్డాయని మనము చదువుచున్నాము. అబ్రాహామునకు కూడా  అల్లాహ్ తన “గ్రంథమును” ఇచ్చినట్టుగా ఈ క్రింది వచనములో చదువుతాము.

''ఈ విషయమై పూర్వం వచ్చిన గ్రంథాల్లోనూ చెప్పబడింది (అంటే) ఇబ్రాహీమ్, మూసాలపై అవతరించిన గ్రంథాలలో.'' సూరా 87:18-19.

పైనున్న వచనముల ప్రకారంగా అబ్రాహాముకు, లోతుకు, ఇస్మాయీలుకు, ఇస్సాకుకు, యాకోబుకు, యోసేపుకు, ఏలీయాకు ఇవ్వబడిన లేఖనాలు ఏవో మాకు తెలియచేయాలని ముస్లింలను మేము కోరుతున్నాము.

ఖురాన్ ఇక్కడ ప్రస్తావించిన పుస్తకాలు ఒకప్పుడు ఉండేవనుటకు అనుగుణంగా వారు ఇస్లాంకు పూర్వమున్న ఋజువులను కొన్నింటిని చూపించాలని మేము కోరుతున్నాం. గ్రంథపు చుట్టలను, లేదంటే ఆర్కియలాజికల్ (భూగర్భ) సాక్ష్యాలను, లేక బైబిల్ పరమైన ఋజువులను చూపించాల్సిందిగా కోరుతున్నాం. అలాంటి లేఖనాలు ఉన్నాయి అనుటకు ఋజువు ఇంతమట్టుకు ఎవరికీ ఎక్కడా దొరకలేదు, ఇకనెన్నటికీ దొరకవు, ఎందుకంటే అది మన పేరులేని అల్లాహ్‍కు కలిగిన భ్రాంతియే తప్ప సత్యం ఎంతమాత్రం కాదు కాబట్టి.

ఈ క్రింది ఖుర్ఆన్ వచనము మన ముందుకు ప్రపంచములోని ఏ ముస్లిమూ సమాధానమివ్వలేని ఇంకెంతటి పెద్ద విషమ పశ్నను తీసుకువస్తున్నదో చూడండి:

''ఈ గ్రంథంలో ఇస్మాయీల్ను గురించి ప్రస్తావించు. అతను వాగ్దాన పాలకుడు, సందేశహరుడైన ప్రవక్త.'' (సూరా 19:54)

ఇస్మాయీలు ఒక సందేశహరుడైన ప్రవక్త అని ఖురాన్లోనే పిలువబడ్డాడు. అతడు ఒక సందేశహరుడు మరియు ప్రవక్త కూడా కాబట్టి, తప్పనిసరిగా అల్లాహ్ అతనికిచ్చిన నూతన పుస్తకంతోను, నూతన షరీయహ్‍తోనూ (ధర్మశాస్త్రంతో) వచ్చినవాడై ఉండాలికదా? అలాగయితే, ముస్లిములకు ఎంతో ప్రతిష్ఠాత్మక పితరుడైన ఇస్మాయీల్ తెచ్చిన ఆ విలువైన పుస్తకం ఎక్కడుంది? ఆయన వ్రాసిన ఆ విలువైన షరీయహ్ గ్రంథము ఎక్కడ? అలాంటి పుస్తకాలు, అలాంటి లేఖనాలు ఉన్నాయని అనుటకు ఇస్లాంపూర్వ సాక్ష్యాధారాలు ఏవైనా కొన్నైనా అందుబాటులో ఉన్నాయా? లేనే లేవు. మరి ఎంతకాలం భయముతో మీరు నిరాధార అసత్యాలను నమ్ముకుంటుంటారు? ఆలోచించండి!

ఆంగ్ల మూలం - Was Muhammad the Last Messenger?


ఖుర్‍ఆన్

ఆన్సరింగ్ ఇస్లాం తెలుగు