కేవలం అనుమానముతో ముహమ్మద్ హత్యలు చేయుట

వాల్యూం 4 పుస్తకం 52 సంఖ్య 286:

సలమ బిన్ అల్ అక్వా ఈ విధంగా సెలవిచ్చాడు:

''ప్రవక్త ఒక ప్రయాణంలో ఉండినప్పుడు, అవిశ్వాసులకు చెందిన ఒక గూఢచారి ఆయన దగ్గరకు వచ్చాడు. ఆ గూఢచారి ప్రవక్త యొక్క సహచరులతో కూర్చుండి వారితో ముచ్చటించడం ప్రారంభించాడు; ఆపై అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ప్రవక్త (తన సహచరులతో) ఇలా అన్నాడు - 'వాడిని తరిమి పట్టుకొని హత్య చేయండి'. కాబట్టి, నేను అతడిని హత్య చేశాను.'' అప్పుడు ప్రవక్త (యుద్ధపు కొల్లసోమ్ములోని వాటాకు అదనంగా) ఆ చంపబడ్డ గూఢచారి యొక్క వస్తువులను కూడా అతనికి ఇచ్చాడు.

మనకు స్పష్టముగా ఇక్కడ కనిపిస్తున్నదేమనగా - అతడి విషయమై సరైన ఏ న్యాయవిచారణ కూడా జరిగించబడలేదు; అతడు నిజంగా ఒక గూఢచారో కాదో తెలుసుకోవడానికిగాని, లేక అతడు వారిని విడిచి వెళ్ళిపోవడానికి వేరే ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనైనాగాని ఏ విచారణ కూడా చేయలేదని తెలుస్తున్నది. ముహమ్మద్ కేవలం అనుమానించాడు, మరియు కేవలం ఆ అనుమానమునే ఒక ఆధారంగా చేసుకొని అతడిని హత్య చేయించాడు.

సత్యాన్ని ఆధారం చేసుకొని దాని ప్రకారం చేసిన న్యాయ సమ్మతమైన తీర్పేనా ఇది? మనుషులు తమ తరపు నుంచి మొదటిగా తమ విషయాలను వివరించి తెలియచేయడానికి కనీస కనీస అవకాశం కూడా ఇవ్వకుండా వారిని ఆ రకంగా హత్య చేయడము న్యాయమేనా? ఇది బైబిల్‍లోని న్యాయవంతుడైన యెహోవా దేవుని నీతికి ఏమాత్రమూ పోల్చలేనంత హీనమైనది. తనను, తన నీతిని తెలిసికొనే కృపను నిజదేవుడైన యెహోవా మీకు దయచేయును గాక! ఆమేన్.


ముహమ్మద్ యొక్క శత్రువులు
ఆన్సరింగ్ ఇస్లాం తెలుగు