సల్లం ఇబ్న్ అబు’ల్-హుకైక్ యొక్క హత్య

కందకము దగ్గర జరిగిన యుధ్ధము మరియు బనీ ఖురైజా యొక్క వ్యవహారములు జరిగిపోయిన తరువాత, అనేక తెగలవారిని అపొస్తలునికి విరోధంగా సమకూర్చిన వారిలో ఒకడైన - అబు రఫి అని మారుపేరు కలిగిన - సల్లం ఇబ్న్ అబు’ల్ హుకైక్ గురించిన ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అపొస్తలునికి వ్యతిరేకంగా వైరాన్ని కలిగివుండటమే కాకుండా ఆయనకు విరోధంగా మనుషులను కూడా ప్రేరేపించేవాడనే కారణాన్నిబట్టి, కాబ్ బిన్ అల్-అష్రఫ్‍ను ఉహుద్ (యుద్ధానికి) ముందే ఔస్ (తెగవారు) హత్య చేశారు. కాబట్టి ఖైబర్‍లో ఉన్న సల్లంను హత్య చేయడానికి తమకు కూడా అనుమతి కావాలని ఖజ్‍రజ్ (తెగవారు) అపొస్తలుడి దగ్గరకు వెళ్ళి అనుమతిని పొందారు.

అబ్దుల్లాహ్ బిన్ కాబ్ బిన్ మాలిక్ వద్ద తెలిసికొని ముహమ్మద్ బిన్ ముస్లిం బిన్ షిహాబ్ అల్-జుహ్రీ ఈ విధంగా నాతో చెప్పాడు: దేవుడు అపొస్తలుడి కోసం చేసిన ఒక విషయం ఏమనగా, అన్సారీలకు చెందిన - ఔస్ మరియు ఖజ్‍రజ్ అను రెండు తెగలు అపొస్తలుడి పక్షంగా రెండు ఎద్దుల్లాగ ఒకరితో ఒకరు పోటి పడేవారు. ఒకవేళ ఔస్ గనుక అపొస్తలుడికి అనుకూలంగా ఏమైనా చేస్తే ఖజ్‍రజ్ వారు ఈ విధంగా అనేవారు - "వీరు అపొస్తలుడి దృష్టిలోగాని ఇస్లాం మతంలోగాని మామీద ఇలాంటి ఆధిక్యాన్ని కలిగి ఉండకూడదు". అందువల్ల వారు కూడా అలాంటి కార్యాన్నే దేన్నైనా చేసేవరకు విశ్రమించేవారు కారు. ఒకవేళ ఖజ్‍రజ్ వారు గనుక ఏమైనా చేస్తే, ఔస్ వారు కూడా ఇలాగే అనేవారు.

అపొస్తలునికి శత్రువుగా ఉన్నాడనే నెపంతో కాబ్‍ని ఔస్ తెగవారు హత్య చేసినప్పుడు, ఖజ్‍రజ్ తెగవారు ఇలా అనుకుంటూ తమను తాము ప్రశ్నించుకున్నారు - “అపొస్తలుడి పట్ల కాబ్‍ఎలాంటి శత్రుత్వపు వైఖరిని కలిగివున్నాడో అలాంటి శత్రుత్వపు వైఖరి కలిగినవాడు ఇంకెవరైనా ఉన్నారా”? అప్పుడు వారు ఖైబర్‍లో ఉన్న సల్లంను జ్ఞాపకం చేసికొని, అతడిని హత్య చేయడానికి అపొస్తలుడి వద్ద నుండి అనుమతి కోరి, దాన్ని పొందారు.

ఖజ్‍రజ్‍తెగ సంబంధికులైన బనీ సాలిమాకు చెందిన ఐదుగురు మనుష్యులు అపొస్తలుని దగ్గరకు వెళ్ళారు. వారెవరనగా: అబ్దుల్లాహ్ బిన్ ఆతిక్, మసూద్ బిన్ సినన్, అబ్దుల్లాహ్ బిన్ ఉనైస్, అబు ఖతాదా అల్-హారిత్ బిన్ రిబీ, మరియు అస్లంకు చెందిన ఒక స్నేహితుడైన ఖుజై బిన్ అస్వద్. వారు బయలుదేరి వెళ్తుండగా అపొస్తలుడు అబ్దుల్లాహ్ బిన్ ఆతిక్‍ని వారికి నాయకుడిగా నియమించాడు. స్త్రీలను కాని చిన్న పిల్లలను కాని చంపవద్దు అని వారికి చెప్పాడు. వారు రాత్రివేళ ఖైబర్‍లో ప్రవేశించినప్పుడు చుట్టుపక్కల ఉన్నవారి తలుపులన్నింటికి గొళ్ళాలు పెట్టిన తరువాత సల్లం ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో అతడు తన మేడగదిలో ఉన్నాడు; ఆ మేడ గదికి ఒక నిచ్చెన వేసివుండినది. వారు మెల్లగా ఆ నిచ్చెన ఎక్కి దాని ద్వారా  తలుపు దగ్గరకు వెళ్లి మేము లోపలి రావచ్చా అని కేక వేశారు. అప్పుడు అతని భార్య బయటకు వచ్చి మీరెవరు అని ప్రశ్నించగా, మేము సరుకులు కొనవెతుకుతున్న అరబ్బులమని వారు జవాబు ఇచ్చారు. కాబట్టి ఆమె - “మీకు కావలసిన మనిషి లోపల ఉన్నాడు మీరు లోపలికి రావచ్చు” అని చెప్పింది. మేము లోపలికి ప్రవేశించినప్పుడు మాకూ అతనికి మధ్య ఎవరూ రాకూడదనే ఉద్దేశ్యంతో మేము ఆమె వెనకాలే తలుపుకు గొళ్ళెం పెట్టాము. అప్పుడు అతని భార్య కెవ్వున ఒక కేకపెట్టి మా గురించి అతనికి హెచ్చరిక చేసింది. అయితే అతను ఇంకా పడక మీద ఉండగానే మేము మా కత్తులతో అతని దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్ళాము. రాత్రివేళ అంత చీకట్లో కూడా అతని దగ్గరకు మమ్మును నడిపించినది ఏదనగా - ఐగుప్తు దుప్పటివలే తెల్లగా ఉండిన అతని మేని ఛాయ. అతని భార్య కెవ్వున ఒక కేక పెట్టినప్పుడు మాలోని ఒకడు ఆమే మీదకు కత్తి దుశాడు, కాని అపొస్తలుడు స్త్రీలను చంపవద్దని చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొని కత్తిని కిందకు దించాడు, లేకపోయుంటే ఆ రాత్రే ఆమెను హత్య చేసివుండేవారము. మేము మా కత్తులతో అతడిని హత్య  చేసినప్పుడు, అబ్దుల్లాహ్ బిన్ ఉనైస్ తన కత్తిని అతని పొట్టలో దూర్చి, అది అతని వీపుగుండా బైటకు వచ్చేవరకు అతని మీదకు వంగి ఆ కత్తిని బలంగా పొడుస్తూ "కత్ని, కత్ని" అన్నాడు; దానికి "ఇక చాలు (అయిపోయింది)" అని అర్థం .

మేము బయటకు వెళ్ళాము. అబ్దుల్లాహ్ బిన్ ఆతిక్‍కి దృష్టి మాంద్యం ఉండడం వల్ల అతను నిచ్చెన మీద నుండి కిందకు పడ్డాడు; అందువలన అతని చేయి తీవ్రంగా బెణికింది. అయితే అతడిని మోసుకుంటూ, నీటి సరఫరాకై వారు ఉపయోగించే ఒక నీటి కాలువలో మేము ప్రవేశించాము. అప్పుడు అక్కడి ప్రజలందరు తమ దీపములు వెలిగించి మమ్మల్ని వెతకడానికి అన్ని దిశలలో వెళ్ళారు. కాని వారు మమ్ములను కనుగొనలేక చనిపొతున్న తమ యజమాని దగ్గరకు తిరిగివెళ్ళి అతని చుట్టూ గుమికూడారు. అప్పుడు, దేవుని శత్రువు చనిపోయాడో లేదో తెలిసికొనుటకై మాలో ఒకడు స్వచ్ఛందంగా అక్కడకు వెళ్ళి అక్కడున్న మనుష్యులలో కలిసిపోయాడు. అలా వెళ్ళినవాడు తిరిగివచ్చి మాతో ఇలా అన్నాడు: "అతని భార్య మరియు కొంతమంది యూదులు అతని దగ్గర గుమికూడి ఉన్నారు. ఆమె చేతిలో ఒక దీపం ఉండినది. ఆమె అతని ముఖాన్ని తీక్షణంగా చూస్తూ వారితో - ‘దేవుని సాక్షిగా చెపుతున్నాను, అబ్దుల్లాహ్ బిన్ ఆతిక్ గొంతు అప్పుడు నాకు వినపడింది. కానీ, బిన్ ఆతిక్ ఈ దేశంలో ఎలా ఉండగలడు? నేనే పొరబడుతున్నానేమో అని అనుకున్నాను’ అని అన్నది. తరువాత ఆమె అతని వైపు తిరిగి, అతని ముఖములోకి తొంగి చూసి ఇలా అన్నది - ‘యూదుల దేవుని సాక్షిగా ఇతను చనిపొయాడు’! అప్పటి వరకు నేను విన్న అన్ని మాటల్లోకేల్లా ఈ మాటలే నాకు అతి మధురంగా అనిపించాయి."

అప్పుడు అతడు తిరిగి వచ్చి మాకు ఆ సమాచారాన్ని చెప్పాడు. మేము మా సహచరుడిని పైకెత్తి మోసుకుంటూ అపొస్తలుడి దగ్గరకు వెళ్ళి - మేము దేవుని శత్రువును హత్య చేశాము అనే వర్తమానాన్ని ఆయనకు అందించాము. అతని హత్య ఎవరు చేశారు అనే విషయమై అపొస్తలుడి ఎదుట మేము గొడవకు దిగాము. మాలోని ప్రతి ఒక్కడూ నేను చేశాను అంటే నేను చేశాను అని చేప్పుకున్నారు. అప్పుడు అపొస్తలుడు మా కత్తులను చూపించమన్నాడు; మా కత్తులను అతడు చూసినప్పుడు ఈ విధంగా అన్నాడు, - "అబ్దుల్లాహ్ బిన్ ఉనైస్ యొక్క కత్తే అతడిని చంపింది, ఎందుకనగా దాని మీద నాకు అతడు తిన్న ఆహారపు ఛాయలు కనిపిస్తున్నవి.''

సీరతుల్-రసూల్, 714-715 వ వచనాలు

పాఠం కొనసాగుతుంది :

కాబ్ మరియు సల్లంల హత్యలను ప్రస్తావిస్తూ హస్సన్ బిన్ తాబిత్ ఈ విధంగా అన్నాడు:

ఆహా దేవా! ఓ ఇబ్న్ అల్ హుకైక్ మరియు ఇబ్న్ అల్-అష్రఫ్
ఎంత మంచి బృందాన్ని మీరు కలిశారు!
వారు మీ వద్దకు పదునైన కత్తులతో వచ్చారు,
గుబురుగా ఉన్న పొదలలో నక్కివున్న చురుకైన సింహములవలే,
నీ ఇంటి మీద వారు దాడి చేసి, మిక్కిలి వేగంగా హత్య చేయగలిగిన తమ కత్తులతో మరణాన్ని మీకు త్రాగించారు,
ప్రతి క్షతగాత్రావకాశాన్ని హేళన చేశారు.

సిగ్గు పడడానికి బదులుగా ఈ హత్యలను ఇస్లాం యొక్క విజయాలుగా భావిస్తూ వీటిని ఉత్సవాలుగా జరుపుకున్నారు. ఇస్లాంమత వ్యాపకంలో ఈ హత్యలు అంతర్భాగమే.

ఈ కథల యొక్క పేర్లను వాటి వరుసన చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుచున్నది:

  • బనీ ఖురైజ పై దండయాత్ర
  • సల్లం ఇబ్న్ అబు’ల్-హుకైక్ యొక్క హత్య
  • అమ్ర్ బిన్ అల్-అస్ మరియు ఖాలిద్ బిన్ అల్-వలీద్  ఇస్లాంని స్వీకరించడం
  • బనీ లిహియాన్ పై దండయాత్ర
  • ధు కరద్ పై దండయాత్ర
  • బనీ అల్-ముస్తాలిక్ పై దండయాత్ర

ఆయా తెగల మీద, పట్టణముల మీద, స్థావరాల మీద దాడి చేసే విధానములోను- వారు ఇస్లాంను స్వీకరించే పద్ధతిలోను - వారు తరువాత చేయబోయే దాడుల విషయంలోను - ఈ కథలు సాధారణంగానే ఒక దానికి ఒకటి కొంచెం తేడాను కలిగివుంటాయి. అయితే ఈ కథల్లో ముహమ్మద్ యొక్క వ్యక్తిగత శత్రువుల హత్యలే మనకు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ఇస్లాంమత వ్యాపకంలో నిత్యమూ ఒక సాధారణ భాగమే. ఇబ్నె హిషాం యొక్క అభిప్రాయంలో కూడా ఇది తప్పు కాదు.


ముహమ్మద్ యొక్క శత్రువులు
ఆన్సరింగ్ ఇస్లాం తెలుగు