సామాన్య ప్రశ్నలకు జవాబుల శ్రేణి

శాం షమూన్

ప్రశ్న:
హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 1:8-9 వచనముల ప్రకారముగా దేవుడైన యేసుక్రీస్తు ప్రభువునకు పైన వేరొక దేవుడున్నాడు.  కొంతమంది క్రైస్తవులు పై వచనములు యేసుక్రీస్తు ప్రభువు యొక్క మానవత్వాన్ని సూచిస్తున్నాయి కాబట్టి, ఒక మానవునిగా ఆయనకు పైన ఒక దేవుడున్నాడు అని అంటారు. అయితే అలా భావిస్తే వచ్చే చిక్కేమంటే,  కేవలం మానవుడైన యేసుక్రీస్తు ప్రభువుకు దైవత్వం ఆపాదించి ఆయన మానవత్వానికే దైవత్వము కట్టబెట్టారు అనే అపవాదు కలుగవచ్చు. ఇలాంటి సమస్యలన్నీ క్రైస్తవులు ఎలా అధిగమిస్తారు?

జవాబు:
ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చుటకు ముందు ఆ వచనాలను వాటి పూర్వోత్తరసందర్భములతో పరిశీలించాలి:

పూర్వకాలమందు నానాసమయములలోనునానావిధములుగాను ప్రవక్తలద్వారా మనపితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారునిద్వారా మనతో మాటలాడెను. ఆయన (ఆ కుమారుని) సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయనద్వారా ప్రపంచములనునిర్మించెను. ఆయన దేవుని మహిమయొక్క తేజస్సును, 3ఆయన తత్వముయొక్క మూర్తిమంతమునైయుండి, తన మహత్తుగలమాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతల కంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోకమందు మహామహుడగు (దేవుని) కుడిపార్శ్వమున కూర్చుండెను. ఏలయనగా-నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కంటిని అనియు; ఇదియుగాక-నేను ఆయనకు తండ్రిని, ఆయన నాకు కుమారుడుఅనియు ఆ దూతలలో ఎవనితోనైన ఎప్పుడైనను చెప్పెనా? మరియు ఆయన భూలోకమునకు ఆదిసంభూతుని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరు ఆయనకు నమస్కారము చేయవలెననిచెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగానుతన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసికొనువాడుఅని తన దూతలనుగూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారునిగూర్చియైతే-దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది;నీ రాజ్యదండమున్యాయార్థమై యున్నది. నీవు నీతిని ప్రేమించితివిదుర్ణీతిని ద్వేషించితివిఅందుచేత దేవుడు నీ దేవుడు నీతోటివారికంటెనిన్ను ఎక్కువగా ఆనంద తైలముతో అభిషేకించెను. మరియు-ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాదివేసితివిఆకాశమండలము నీ చేతిపనియైనది, అవి నశించును గాని నీవు శాశ్వతముగా ఉందువుఅవన్నియువస్త్రమువలె పాతగిలిపోవును, ఉత్తరీయమువలె వాటిని మడిచివేతువుఅవి వస్త్రమువలె మార్చబడును గానినీవు ఏకరీతిగానే యున్నావునీ సంవత్సరములు తరుగవుఅని చెప్పుచున్నాడు. అయితే-నేను నీ శత్రువులను నీ పాదములకుపాదపీఠముగా చేయు పర్యంతమునా కుడిపార్శ్వమున కూర్చుండుము10అని దూతలలో ఎవనిగూర్చియైన యెప్పుడైన చెప్పెనా? వీరందరు రక్షణయను స్వాస్థ్యము పొందబోవువారికి పరచారముచేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా?” (హెబ్రీయులకు 1:1-14)

పైన చెప్పబడిన వాక్యభాగములు యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ఈ క్రింది విధముగా చెప్పుచున్నవి:

ఆయన శరీరధారుడవక ముందు సృష్టికారకునిగా ఉన్నారు.
శరీరధారునిగా ఉండినప్పుడు ఆయన విమోచకునిగా ఉన్నారు.
ఆయన పునరుత్థానుడై మహిమలోనికి కొనిపోబడిన తరువాత దేవుని సింహాసనముపైన ఆసీనుడై నిరంతరము పరిపాలించుచున్నారు.

అనగా, అధ్యాయమంతా కూడా యేసుక్రీస్తు ప్రభువు మానవునిగా జన్మించక ముందు, మానవునిగా జన్మించిన తరువాత, మరియు ఆయన పునరుత్థానుడై పరలోకమునకు కొనిపోబడిన తరువాత ఏ విధముగా ఉనికిలో ఉన్నారో అనే విషయమై మనలను ఆలోచింపచేయుచున్నది.

ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదాన్నిబట్టి చూస్తే, హెబ్రీయుల గ్రంథకర్త యేసుక్రీస్తు ప్రభువు యొక్క సంపూర్ణ వ్యక్తిత్వమును గురించి మాట్లాడుతున్నాడు, అనగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఉనికినంతటిని పునర్విమర్శిస్తున్నాడు అని స్పష్టముగా తెలుస్తున్నది. యేసుక్రీస్తు కలిగియున్న స్వభావములు ఒకటా లేక రెండా, ఆయన ఒకే సమయములో దేవుడు మరియు మానవుడుగా ఉన్నారా? అని ఆయన స్వభావముల పైన ఆ గ్రంథకర్త దృష్టిసారించడము లేదు, గాని ఆయన నిర్వహించిన అనేకమైన కార్యముల పైన తన దృష్టిని సారించాడు. యేసుక్రీస్తు ప్రభువు నిత్యుడైన ఒక వ్యక్తిగా ఉంటూ, సృష్టికర్తగా, విశ్వనిర్వాహకుడుగా, విమోచకుడుగా మరియు నిత్యుడైన రాజుగా వివిధ కార్యములతో కూడిన పాత్రలను నిర్వహించారని మాత్రమే ఆ రచయిత మాట్లాడుచున్నాడు.

పై వాటిని మనస్సులో ఉంచుకొని మనము ఇప్పుడు ముఖ్యమైన అభ్యంతరములకు జవాబులు తెలిసికొందాము. మొదటిగా మనము తెలుసుకోవలసినది ఏమనగా హెబ్రీ పత్రికలోని 1:8-9 వచనములు కీర్తనలు 45:6-7లో నుండి తీసికొనబడినవి. ఆ కీర్తన  దావీదువంశపు రాజుల వివాహోత్సవ సందర్భమునకు అనుగుణంగా కూర్పుచేయబడినది. పాఠకులు తెలిసికొనులాగున ఇక్కడ  ఆ కీర్తననంతయు ఇచ్చుచున్నాము:

ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజునుగూర్చి రచించినదానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలమువలె నున్నది. నరులకంటె నీవు అతిసుందరుడవై యున్నావు నీ పెదవులమీద దయారసము పోయబడియున్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. సత్యమును వినయముతోకూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలు దేరుము. నీ దక్షిణహస్తము భీకరమైనవాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీచేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్రకంటె హెచ్చగునట్లుగా నిన్ను ఆనందతైలముతో అభిషేకించి యున్నాడు. నీ వస్త్రములెల్ల గోపరస వాసనే అగరు వాసనే లవంగిపట్ట వాసనే. దంతముతో కట్టిన నగరులలో తంతివాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిలుచుచున్నది. కుమారీ, ఆలకించుము ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును నీ తండ్రి యింటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. తూరు కుమార్తె నైవేద్యము తీసికొనివచ్చును, జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదకుదురు. అంతఃపురములోనుండు రాజుకుమార్తె కేవలము మహిమ గలది ఆమె వస్త్రము బంగారు బుట్టాపని చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజు నొద్దకు ఆమె తీసికొని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు నీయొద్దకు తీసికొని రాబడుచున్నారు. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు, రాజనగరులో ప్రవేశించుచున్నారు. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు. భూమియందంతట నీవు వారిని అధికారులనుగా నియ మించెదవు. తరములన్నిటను నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు.” (కీర్తనలు 45:1-17)

హెబ్రీ గ్రంథకర్త ఈ వాక్యభాగమును యేసుక్రీస్తు ప్రభువు యొక్క మెస్సీయా పదవికి, అనగా ఆయన శరీరధారియై ఒక మానవునిగా దావీదు సంతానమందు జన్మించుట ద్వారా పొందుకొనిన ఆ పదవికి అన్వయించుచున్నాడు:

దూత -మరియా, భయపడకుము; దేవునివలన నీవు కృపపొందితివి. ఇదిగో నీవు గర్భముధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు; ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగముల నేలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను.” (లూకా సువార్త 1:30-33)

"దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తలద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు, శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను." (రోమా 1:4-5)

మరో విధంగా చెప్పాలంటే, ఆ గ్రంథకర్త కీర్తనలు 45:6-7 వచనములను యేసుక్రీస్తు ప్రభువు యొక్క మెస్సీయా పదవికి అన్వయిస్తూ చెప్పుచున్నాడు. దావీదు మరియు అతని కుమారులకు రాజ్యాధికారము, సింహాసనము నిత్యముగా తరతరములుండునని దేవుడు చేసిన వాగ్దానములు దావీదు వంశజుడిగా ఆయన సంపూర్ణముగా నెరవేరుస్తున్నారని ఆ గ్రంథకర్త ఋజువు చేశాడు:

"మరియు ఇశ్రాయేలీయులను నా జనులు ఇకను కదిలింపబడకుండ తమ స్వస్థలమందు నివసించునట్లు దానియందు వారిని నాటి, పూర్వము ఇశ్రాయేలీయులను నా జనులమీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచు వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్ట పెట్టకయుండునట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమునిచ్చి నీకు నెమ్మది కలుగ జేసియున్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయునదేమనగా - నేను నీకు సంతానము కలుగజేయుదును. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడ నిద్రించిన తరువాత నీ గర్భములోనుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనతకొరకు ఒక మందిరమును కట్టించును; అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను; నేనతనికి తండ్రినై యుందును. అతడు నాకు కుమారుడై యుండును; అతడు పాపము చేసినయెడల నరులదండముతోను మనుష్యులకు తగులు దెబ్బలతోను శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను." (2 సమూయేలు 7:10-15)

ఇక్కడ గమనించవలసినదేమనగా, 2సమూయేలు 7:14వ వచనము హెబ్రీయులకు 1:5లో యేసుక్రీస్తుకు అన్వయించబడింది!

అయితే, దావీదు వంశమందు యేసుక్రీస్తు ప్రభువు మానవునిగా జన్మించుట ద్వారా మాత్రమే ఆ వాగ్దానము నెరవేరును గనుక, హెబ్రీయులకు 1:8-9 వచనములలో ఆ గ్రంథకర్త దీనిని దృష్టిలో ఉంచుకొని యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా మన మధ్యకు వచ్చిన విధానమును, మరియు ఆయన మహిమలోనికెత్తబడుటను గురించి ప్రస్తావించి ఆ ప్రవచనములు ఎలా  యేసుక్రీస్తు ప్రభువులో అక్షరాలా నెరవేరాయో విశదపరిచాడు. మెట్టుకు, యేసుక్రీస్తు ప్రభువు మానవ స్వభావమును తీసుకొనియుండకపోతే ఆయన దావీదు సంతానమైయుండేవారు కాదు కాబట్టి దావీదునకు ప్రత్యామ్నాయముగా అతని సింహాసనము మీదనుండి పరిపాలన చేయలేరు. ఇదియుగాక, దావీదుకు ప్రత్యామ్నాయముగా సింహాసనము పైన కూర్చొనుటకు యేసుక్రీస్తు ప్రభువు నిజమైన మానవునిగా జన్మించి నిరంతరము మానవునిగానే ఉంటున్నారు. కావుననే, తండ్రి ఆయనకు దేవుడయ్యాడు మరియు నిరంతరము దేవునిగానే ఉంటాడు. కావున యేసుక్రీస్తు తనకు పైన దేవుడిని కలిగి ఉండుట వలన ఏ సమస్యా తలెత్తదు.

ఐతే పైన ప్రస్తావించబడిన ఆ వచనాలు యేసుక్రీస్తు ప్రభువు యొక్క మానవత్వమును సూచిస్తున్నాయని మనము చెప్పుకున్నాము కాబట్టి, ఆయన యొక్క మానవత్వానికే దైవత్వం ఆపాదించబడుట ద్వారా ఆయన దేవుడుగా పిలువబడుచున్నారా? అలా కానే కాదు.

శరీరధారియైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువు దేవునిగా ఉండటము చాలించలేదు, కాని తన దైవవ్యక్తిత్వానికి అదనపు స్వభావమును కలుపుకున్నారు. హెబ్రీయులకు 1:8-9 వచనములు యేసుక్రీస్తు ప్రభువును దేవునిగనో లేక మానవునిగనో చూపించుట కొరకై వ్రాయబడలేదు గాని, ఆయన శరీరధారియగుట, తరువాత పునరుత్థానుడగుట మరియు మహిమలోనికి ఎత్తబడుట అను ముఖ్య అంశములను వివరించుట కొరకు చెప్పబడినవి. ఐతే ఆ వచనములు ప్రస్తుతమందు ఒకే సమయములో దేవుడుగను మరియు మానవుడుగనున్న ఒకే వ్యక్తిని గురించి మాట్లాడుచున్నవి. సరళమైన మాటల్లో చెప్పాలంటే, హెబ్రీయులకు 1:8-9వచనములు క్రీస్తు యొక్క పునరుత్థానము పిమ్మటి మహిమను గురించి ప్రస్తావించుచున్నవి గనుక యేసుక్రీస్తు ప్రభువు తన దైవస్వభావమును బట్టి  దేవునిగా పిలువబడుతున్నారు, అలాగే తన మానవత్వమునుబట్టి  తనకు పైన దేవుడు ఉన్నట్లుగాను  పిలువబడుతున్నారు. ఈ రెండు స్వభావాలలో ఏదైనా ఒక స్వభావం ఆయనలో ఉండుండవచ్చు అని వాక్యం ఇక్కడ తెలియచేయటం లేదు గాని ఆ రెండూ అనగా మానవ స్వభావం మరియు దైవ స్వభావం కూడా ఆయనలో ఉన్నాయనే వాస్తవమే ఇక్కడ తెలియచేస్తున్నది.
 దైవమానవునిగా దావీదు సింహాసనము పైన కూర్చొని పాలించుచున్నందుకు తండ్రియైన దేవుడు తన దైవస్వభావకుమారుని ప్రశంసిస్తున్నాడు, ఆమేన్‌. పునరుత్థానుడును మహిమాన్వితుడునైన ప్రభువును, నిత్యము దైవమానవునిగా ఉండువాడును అయిన, యేసు క్రీస్తును, తన సృష్టి అంతయు నిత్యము ప్రస్తుతించును గాక, ఆమేన్‌.


యేసుక్రీస్తు ప్రభువు అసలు దేవుడే కాదు లేక ఒక చిన్న దేవుడు మాత్రమే అని ఋజువు చేయపూనకొని కొందరు ప్రకటన 3:12 ను ఉపయోగిస్తుంటారు.

"జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; అందులోనుండి వాడు ఇకమీదట ఎన్నటికిని వెలుపలికిపోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్తపేరును వానిమీద వ్రాసెదను." (ప్రకటన 3:12)

అత్యుత్సాహము చూపే రచయిత ఒకడు ఇలా వ్రాశాడు:

ఇక్కడ యేసుక్రీస్తు యొక్క మానవ స్వభావము మాట్లాడుచున్నది అని చెప్పుచూ క్రైస్తవులు చాల బలహీనమైన ప్రతివాదముతో వస్తారు. తర్కించడము కోసము ఈ వాదమును మనం అంగీకరించినా, దాని వలన కలిగే పరిణామములు క్లుప్తముగా  ఇలా ఉంటాయి:

యేసు క్రీస్తునకు రెండు స్వభావములు ఉన్నవి, ఒకటి దైవస్వభావము రెండవది మానవస్వభావము
* మానవస్వభావము తినును, నిద్రించును, ప్రార్థించును, దేవుడిని కలిగియుండును.
* దైవస్వభావము నిద్రించదు, ప్రార్థించదు, మరియు దేవుడిని కలిగియుండదు.

ఏదేమైనప్పటికినీ, చాలామందికి ఆశ్చర్యము కలిగించేలా దైవమని నమ్మబడిన యేసుక్రీస్తే తనకు దేవుడున్నాడని చెప్పారు!
దైవమైన యేసుక్రీస్తు తనకు కూడా దేవుడున్నాడని చెప్పటం మీరు ఇక్కడ  చూడవచ్చు! ఇక్కడ యేసుక్రీస్తు మనుష్యునిగా మాట్లాడటం లేదుగాని  దైవముగా మాట్లాడుచున్నారు, కావున దైవమైన యేసుక్రీస్తు నాకు కూడా  దేవుడున్నాడని ఎలా చెప్పగలరు? కాబట్టి “దైవమైన యేసుక్రీస్తు” అనేటువంటిది ఏమియులేదు. మరియు యేసుక్రీస్తు దేవుడు కూడా కాదు ఎందుచేతనంటే చివరకు తాను దైవావస్థలో ఉన్నప్పుడు కూడా ఆయనకు దేవుడు ఉన్నాడు, అని స్పష్టముగా ఇది ఋజువుపరచుచున్నది.
అందుకే దీనిపైన క్రైస్తవుల ప్రతిస్పందనను చూడాలని నేను నిజముగా ఆశించుచున్నాను. దైవమైన యేసుక్రీస్తు నాకు దేవుడున్నాడు అని ఎందుకు చెప్పాడు? (source)

ప్రకటనగ్రంథములో ఉన్న యేసుక్రీస్తు ప్రభువు ఇప్పుడు పరలోకములో ఉన్నారు కాబట్టి ఆయన ఇక ఏమాత్రం మానవుడు కాదు అని ఈ ఆక్షేపకుడు తప్పుగా భావించి ఈ తప్పుడు ఆరోపణ చేస్తున్నాడు. ఇంతకు పూర్వం  మనము చూచిన రీతిగా, యేసుక్రీస్తు  ప్రభువు పునరుత్థానుడైన తరువాత కూడా మానవునిగా ఉండటము చాలించలేదు అని పరిశుద్ధ లేఖనములు స్పష్టముగా చెప్పుచున్నవి. వాస్తవానికి, “పునరుత్థానము” అనే పదములో,  క్రీస్తు మహిమశరీరముతో తిరిగి లేచినప్పుడు సహితము ఒక మానవునిగనే ఉండాలి అనే అర్థము కనిపించుచున్నది. యేసుక్రీస్తు ప్రభువు అక్షయత కలిగి పునరుత్థానులైన తరువాత కూడా ఆయన స్థితి ఎలా ఉన్నదో మనకు తెలియచేస్తున్న కొన్ని వచనములను దిగువన గమనించండి:

"వారు మాటలాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి - మీకు సమాధానమవునుగాకని వారితో అనెను. అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై భూతము తమకు కనబడెనని తలంచిరి. అప్పుడాయన - మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేల? నేనే ఆయనను అనుటకు  నా చేతులను నా పాదములను చూడుడి; నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న యెముకలును మాంసమును భూతమునకుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషముచేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన - ఇక్కడ మీయొద్ద ఏమైన ఆహారము కలదా అని వారినడిగెను. వారు కాల్చిన చేప ముక్కను ఆయన కిచ్చిరి. ఆయన దానిని తీసికొని వారియెదుట భుజించెను. అంతట ఆయన - మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడిన వన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సును తెరచి - క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలోనుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయనపేరట మారుమనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడునని వ్రాయబడియున్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు.  ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను; మీరు పైనుండి శక్తి పొందువరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పెను." (లూకా సువార్త 24:36-49)

పునరుత్థానుడైన తరువాత మొదటిసారి కనిపించినపుడు, తనకు యెముకలును మాంసమును గల శరీరము ఉన్నదని యేసు తన శిష్యులకు చూపి ఆహారము తిన్నారు!

"అతడు ప్రవక్తయై యుండెను గనుక - అతని గర్భఫలములోనుండి అతని సంహాసనముమీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టుపెట్టుకొనిన సంగతి అతడెరిగి క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలిసికొని ఆయన పునరుత్థనమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను; దీనికి మేమందరము సాక్షులము." (అపొస్తలుల కార్యములు 2:30-32)

పేతురు తన మొదటి ప్రసంగములో యేసుక్రీస్తు యొక్క శరీరము కుళ్ళుపట్టలేదు అని బోధించాడు; క్రీస్తు భౌతికశరీరంతోనే మరణం నుంచి తిరిగిలేచారు అని ఇది తెలియజేస్తుంది. క్రీస్తు ఒక అక్షయమైన, భౌతికమైన, మహిమాశరీరముతో పునరుత్థానుడయ్యారు అని పేతురు ఇక్కడ దృఢముగా చెప్పుచున్నాడు. అందువల్లనే తాను మరణించి తిరిగి లేచిన తరువాత కూడా మానవునిగానే ఆయన జీవించుచున్నారని పేతురు వొక్కాణించిన విషయాన్నే పౌలు కూడా మళ్ళీ మళ్ళీ చెప్పాడు:

"ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యలకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత నీతిననుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయెడి యొక దినమును నిర్ణయించి యున్నాడు. మృతులలోనుండ ఆయనను లేపినందున దీని నమ్మటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు. మృతుల పునరుత్థానమునుగూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యముచేసిరి; మరికొందరు - దీనిగూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి." (అపొస్తలుల కార్యములు 17:30-32)

లోకమునకు తీర్పు తీర్చబోయేది కూడా యేసు అను నరుడు, అనగా ఇప్పుడు కూడా క్రీస్తు తన మనవస్వభావముతోనే ఉనికియందుంన్నారని దాని అర్థము.

"దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు." (1తిమోతి 2:5)

ఇప్పుడు (ఒకప్పుడు కాదు) విశ్వాసుల కొరకు ఉన్న మధ్యవర్తి క్రీస్తుయేసు అను నరుడు! చివరిగా:

"ఆ పెద్దలలో ఒకడు - ఏడవకుము; ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయముపొందెనని నాతో చెప్పెను." (ప్రకటన 5:5)

"సంఘముల కోసము ఈ సంగతులనుగూర్చి సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కయునై యున్నాను." (ప్రకటన 22:16)

పై వచనములో ఆయన చెప్పుచున్నట్లుగా, తన పునరుత్థానము మరియు పరలోక ఆరోహణము తరువాత కూడ తాను యూదా గోత్రమునందలి దావీదు సంతానముగా ఉండవలెనన్న, ఆయన సదాకాలమునకై  ఒక సంపూర్ణ మానవునిగా ఉండిపోవుటే ఆయనకున్న ఒకే ఒక మార్గము కదా!.

పైన చెప్పబడిన వాటిని అర్థము చేసికొన్నట్లయిన యెడల యేసుక్రీస్తు ప్రభువు పరలోకములో ఉన్నప్పుడు కూడ తనకు పైన దేవుడున్నాడని ఎందుకు చెప్పుచున్నారో ఇప్పుడు సుస్పష్టముగా గోచరమగుచున్నది. క్రీస్తు నిరంతరము మానవునిగానే ఉంటారు కాబట్టి, తండ్రియును నిరంతరము తనకు దేవునిగా ఉంటాడు. ఇంతేగాక ప్రకటన 3:12లో (ఈ తప్పుడు ముస్లిం ఆక్షేపణకు భిన్నముగా) దైవమైన క్రీస్తూ కాదు లేక మానవుడైన క్రీస్తూ కాదు, కాని దేవుడును మరియు మానవుడునైన క్రీస్తు అను ఒకే వ్యక్తి మాట్లాడుచున్నాడు. సరళమైన మాటలో చెప్పాలంటే, ఈ వాక్యములయందు మాట్లాడుచున్నది దైవ-మానవుడైన క్రీస్తు.

ఆంగ్ల మూలం:- Since Jesus has a God, how can he be God himself?


శాం షమూన్
ఆన్సరింగ్ ఇస్లాం తెలుగు